16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన ఛాంబర్ ప్రతినిధులు

21-04-2025 01:26 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణం(Kesamudram town)లో నూతనంగా ఫైర్ స్టేషన్ మంజూరు చేయించినందుకు కృషిచేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడు, మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డిని సోమవారం కేసముద్రం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సన్మానించారు. కేసముద్రం మండలం అర్పణ పల్లి గ్రామంలో వేం నరేందర్ రెడ్డి స్వగృహానికి రాగా ఛాంబర్ ప్రతినిధులు సోమవారం అక్కడికి వెళ్లి వేం నరేందర్ రెడ్డిని సత్కరించారు.  అనేక సంవత్సరాలుగా కేసముద్రం పారిశ్రామిక ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు సంభవించి సకాలంలో అడ్డుకోలేక పోవడంతో, అనేక మంది వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఆర్థికంగా నష్టపోయారని, కేసముద్రంలో ఫైర్ స్టేషన్ మంజూరు చేయడం వల్ల ఇప్పుడు తమకు అగ్ని ప్రమాద ఘటనల నుండి కాపాడుకునే పరిస్థితి కల్పించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.