రివర్స్ టెండరింగ్, ఎస్ఈబీ రద్దు.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
28-08-2024 01:29 PM
అమరావతి: ఏపీ సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వై ఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని మంత్రి వర్గం రద్దు చేసింది. పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. దీంతో పాటు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్ఈబీ) రద్దు పట్టా దారు పాసు పుస్తకాలపై జగన్ ఫోటో తొలగింపు, సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణ, పోలవరం ఎడమకాలువ పనుల పునరుద్ధరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వివాదాల్లోని భూముల రిజిస్ట్రేషన్ కేబినెట్ ఆమోదముద్ర వేసింది.






