13 May, 2026 | 5:37 AM

ఏది నిజం..? ఏది అబద్దం..? పేరుతో కేటీఆర్ ట్వీట్

28-08-2024 02:22 PM

హైదరాబాద్: ఏది నిజం..? ఏది అబద్దం..? అనే పేరుతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'ఎక్స్' వేదికగా ట్వీట్ చేశారు. రైతుల పంట రుణమాఫీపై నేతలు రకరకాలుగా ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రూ.7500 కోట్లు విడుదలైనట్లు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు. రూ.17 వేల కోట్లు మాఫీ చేశామని మంత్రులు అంటున్నారని, రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని ముఖ్యమంత్రి చెబుతున్నారని ఆయన వెల్లడిచారు. రైతుల పంట రుణమాఫీ తాజాగా అయిపోలేదని మధ్యలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వరరావు చెప్పారన్నారు. రైతులతో అసమర్థ కాంగ్రెస్ చెలగాటం ఆడుతుందని, ఎద్దేడ్సిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని కేటీఆర్ ఎద్దెవా చేశారు.