13 May, 2026 | 7:30 AM

కార్తీకమాసం నుంచి నిత్యాన్న దానం ఏర్పాటు

28-08-2024 01:26 PM

రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్నను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, ఈవో మంత్రి పొన్నంకి పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న మంత్రి ఆలయంలో కోడె మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ... శృంగేరి పీఠం అనుమతితో ఆలయం విస్తరిస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. కార్తీకమాసం నుంచి నిత్యాన్న దానం ఏర్పాటు చేస్తామని, నిత్యాన్న దానానికి దాతలు ముందుకు రావాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం రాజన్న ఆలయంలో నిత్యాన్న దాన భవనాన్ని నిర్మిస్తుందన్నారు. స్వచ్చంద సంస్థలు, సేవ చేసే వారు పేర్లు నమోదు చేసుకోవాలని పొన్నం తెలిపారు. హరిత హోటల్ స్థలాన్ని వినియోగంలోకి తెస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.