calender_icon.png 6 May, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి

06-05-2025 12:00:00 AM

హైదరాబాద్, మే 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా జీ చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ అనుమతితో ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చంద్రశేఖర్‌రెడ్డి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం బోరెగామ్ గ్రామానికి చెందినవారు.

ఓయూలో బీఎస్సీ ఫారెస్ట్రీ చేసి 1991లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్‌తో పాటు సీఎం కార్యాలయంలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు.