30 May, 2026 | 2:06 AM

గురుకులాల టైమింగ్స్ మార్పు

30-05-2026 12:26 AM
  1. ఉదయం 9 నుంచి 4.30 గంటల వరకు పనివేళలు
  2. ప్రభుత్వ నిర్ణయంపై గురుకులాల జాయింట్ ఫోరం హర్షం

హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంపై జాయింట్ ఫో రమ్ ఆఫ్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సర్వీస్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది.

గతంలో ఉదయం 8 గంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండే పనివేళలను ఇప్పుడు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఈ మేరకు జాయింట్ ఫోరం నాయకులు తీగల అంజయ్య, జీ మధుకర్, కీర్తి రవి, ఎస్ గణేష్ తదితరులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చిరకాలంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్న టైం టేబుల్ సమస్యను ప్రభుత్వం పరిష్కరించడం అభినందనీయమని పేర్కొన్నారు.

ఉ ద్యోగుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న ఈ నిర్ణయం సిబ్బందికి ఎంతో ఊరట నిచ్చిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గురుకులాల సొసైటీ కార్యదర్శి కంభంపాటి శార దకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.