30-12-2025 12:00:00 AM
ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు సోమవారం ఖమ్మం నగరంలోని రౌడీషీటర్లకు టౌన్ ఏసీపీ రమణమూర్తి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఏసీపీ కార్యాలయంలో ఒక్కొక్కరి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వారు ఎక్కడెక్కడ నివాసం ఉంటున్నారు.. ఏ పని చేసి జీవిస్తున్నారో ఆరా తీశారు. నేరప్రవృత్తిని మార్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నామని, మారకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందని హెచ్చరించారు.
గతంలో నేరాలకు పాల్పడిన పాత నేరస్తులు, రౌడీషీటర్లు, నేర స్వభావం గలవారు తమ నేర ప్రవృత్తిని వీడి సమాజంలో మం చి నడవడికతో కొనసాగాలని సూచించారు నేరాలకు పాల్పడుతున్నట్లు తేలితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నా రు. ప్రభుత్వ, ప్రైవేట్ భూముల కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లు, రియల్టర్లపై పోలీసులు దృష్టి సారించినట్లు తెలిపారు.
నగరంలో జరిగే నేరాల్లో ఎక్కువగా రౌడీ షీటర్లే నిందితులుగా ఉంటున్నారని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుని దాడులకు దిగుతూ.. పో లీస్ రికార్డుల్లోకి ఎక్కుతున్న నేపథ్యంలో వా రిపై ప్రత్యేక నిఘా పెట్టి కట్టడి చేయడం లో భాగంగా ముందుగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా గత కొంత కాలం గా తమ వైఖరిని మార్చుకుని ఎలాంటి నేరా లు పాల్పడకుండా, పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు కాకుండా సత్ప్రవర్తనతో వున్న పాత నేరస్థుల రౌడీషీట్‌ను తొలగించారు.