30-12-2025 12:00:00 AM
సాయిబాబా దేవుడు కాదంటూ పోస్టులు
మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ షిరిడీ సాయి భక్త ఐక్య వేదిక సభ్యుల ఫిర్యాదు
సరూర్‌నగర్‌లో మాధవీలతతో పాటు పలువురు యూట్యూబర్లపై ఎఫ్‌ఐఆర్ నమోదు
నేడు ఉదయం విచారణకు రావాలన్న పోలీసులు
హైదరాబాద్/ఎల్బీనగర్, సిటీ బ్యూరో డిసెంబర్ 29 (విజయక్రాంతి): టాలీవుడ్ న టి, బీజేపీ నాయకురాలు మాధవీలత మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై సరూర్‌గర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సోష ల్ మీడియా వేదికగా షిరిడీ సాయిబాబా దేవుడు కాదంటూ ఆమెతో పాటు కొందరు యూటూబర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సరూర్‌నగర్ పోలీసులకు సోమవారం షిరిడీసాయి భక్త ఐక్య వేదిక సభ్యులు ఫిర్యాదు చేశారు.
దీంతో మాధవీలతపై కేసు నమోదైంది. గత కొద్దిరోజులుగా మాధవీలత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా సాయిబాబా దైవత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఆమెతో పాటు మరికొందరు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్లు కూడా ఇదే తరహా ప్రచా రం చేస్తున్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సరూర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు అందడంతో వారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మాధవీలత, ఇతర యూ ట్యూబర్ల పోస్టుల కారణంగా సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, ప్రజల మతపరమైన భావోద్వేగాలకు నష్టం వాటిల్లుతోందని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న మాధవీలత, ఇతర యూట్యూబర్లు మంగళవారం ఉదయం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని సీఐ సైదిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వారి సోషల్ మీడి యా ఖాతాలు, వారు చేసిన పోస్టులు, వీడియోలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం.
కాగా కోట్లాది మంది సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా కల్పిత ఆరోపణలను వ్యాప్తి చేస్తున్నారని సాయిబాబా భక్తులు ఆరోపించారు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవారు షిరిడీ సాయిబాబాపై అసత్య ప్రచారం, హిందూ దేవుడు కాదని, సనాతన ధర్మంలో బాబాకు స్థానం లేదని అనేక అసత్యాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.