18 April, 2026 | 1:49 AM

భిక్కనూరులో 16వ వార్డులో డ్రైనేజ్ పనులకు శ్రీకారం

18-04-2026 12:25 AM

భిక్కనూర్, ఏప్రిల్ 17(విజయ క్రాంతి): భిక్కనూర్ మండల కేంద్రంలోని 16వ వార్డులో డ్రైనేజ్ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. గ్రామంలో పారిశుద్ధ్య సమస్యల పరిష్కారం కోసం ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బల్యాల రేఖ, ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు కర్రోల రాజు, పంచాక్షరి, గజ్జ వేణు, సురేష్ గౌడ్, ఆకుల రవి పాల్గొన్నారు. అలాగే డీఎల్పీఓ శ్రీనివాస్, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, కార్యదర్శి మహేష్ గౌడ్ హాజరయ్యారు. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని పనులు త్వరగా పూర్తి చేయాలని కోరారు.