24-05-2025 12:00:00 AM
అట్టహాసంగా ప్రమాణస్వీకారం
రాజేంద్రనగర్ మే 23: చారిత్రాత్మక గోల్కొండ కోట శ్రీ జగదాంబ మహంకాళి (ఎల్లమ్మతల్లి) అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ గా శుక్రవారం లంగర్ హౌస్ కు చెందిన కే. చంటిబాబు ప్రమాణ స్వీకారం చేశారు. కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి (ఎల్లమ్మ తల్లి) అమ్మవారి ఆలయ నూతన కమిటీని దేవదాయ శాఖ ఈవో వసంత, సీఐ సురేఖ ఆధ్వర్యంలో ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు.
ఆలయ చైర్మన్ గా కే. చంటిబాబు. కమిటీ మెంబర్ లు సింగజోగి గిరి, నాగులపల్లి శ్రీకాంత్, దాసరి అనిత, సంతోష్ గౌడ్, ప్రదీప్, పూజారి సర్వేష్ ప్రమాణ స్వీకారం చేశారు. - అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం : ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ కే. చంటిబాబు మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన గోల్కొండ కోట బోనాల జాతర అత్యంత వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అంతేకాకుండా ప్రభుత్వ సహాయ, సహకారాలతో బోనాల జాతర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకుందామని పిలుపునిచ్చారు. అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం రావడం సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈసారి వేడుకలను అంగరంగ వైభవంగా, ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
అనంతరం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా చంటిబాబు తో పాటు సభ్యులకు కార్వాన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఉస్మాన్ బిన్ హాజరే, పరమానందం, పసుపులేటి శ్రీనివాస్, శ్రీరాములు, ఆకుల చంద్రశేఖర్, సంతోష్ గౌడ్, దుర్గా ప్రసాద్, హేమలత, కూరాకుల కృష్ణ, శివశంకర్, సాయిబాబా, శ్రీకాంత్ చారి, సురేష్ చారి, దర్శన్ తదితరులు చైర్మన్ తో పాటు సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.