calender_icon.png 24 May, 2025 | 6:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది

24-05-2025 01:20:38 PM

హైదరాబాద్: ఖమ్మం జిల్లా వైరాలో సింగరేణి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా(Mega Job Fair) నిర్వహించారు. మెగా జాబ్ మేళాకు హాజరైన అభ్యర్థులతో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) మాట్లాడారు. మెగా జాబ్ మేళాలోని ఉచిత వైద్య ఆరోగ్య శిబిరాలను భట్టి విక్రమార్క పరిశీలించారు. పదేళ్లు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించుకోలేదన్న ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశామని చెప్పారు. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. రూ. 9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు.

యువతకు ఉపాధి(Youth employment) కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మెగా జాబ్ మేళా ద్వారా వేల మంది యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. వైరా చెరువులోకి నీరు వచ్చే విధంగా వంద కోట్లతో కెనాల్ ను నిర్మిస్తున్నామని వెల్లడించారు. పంట పండించే రైతులకు మద్దతు ధర ఇస్తున్నాం, రూ. 18 వేల కోట్లతో రైతు భరోసా ఇస్తున్నాం, రాష్ట్రంలో సన్నాలకు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. అడవి బిడ్డల కోసమే ఇందిరా సౌర గిరి జల వికాసం( Indira Saura Giri Jala Vikasam) అనే పథకం తీసుకువచ్చామని సూచించారు. రేషన్ కార్డు(Ration card) లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాణ్యమైన విద్యుత్ అందిస్తోందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.