24-05-2025 12:00:00 AM
-ఎమ్మెల్యే ముఠా గోపాల్
ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి) : ముషీరాబాద్ డివిజన్ మోహన్గర్‌లో కలుషిత నీటి నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ముఠా గోపాల్ స్థానికులకు హామీ ఇచ్చారు. మోహన్ నగర్కు చెందిన బస్తీ పెద్దలు గండి కృష్ణ, పూస గోరఖ్ నాథ్, రాజు, సైదాభానులు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ను కలిసి కలుషిత నీటి సరఫరాను నివారించాలని వినతి పత్రం అందజేశారు.
గత 40 ఏళ్లక్రితం వేసిన డ్రైనేజీ పైప్లైన్లు అద్వానంగా మారడం వల్ల కలుషిత నీటి సరఫరా ఏర్పడుతుందని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఎమ్మెల్యే ముఠా గో పాల్ మాట్లాడుతూ... అస్తవ్యస్థంగా మా రిన డ్రైనేజీ పైప్లైన్లు తొలగించి కొత్త పైజైన్లు వేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పా రు. సమస్యను వెంటనే పరిష్కరించాలని జలమండలి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మోహన్ నగర్ వాసులు జయలక్ష్మి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.