calender_icon.png 24 May, 2025 | 5:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపరేషన్ కగార్‌ను తక్షణమే నిలిపివేయాలి

24-05-2025 12:00:00 AM

- గవర్నర్‌కు గద్దర్ సతీమణి విమల విజ్ఞప్తి 

ఖైరతాబాద్; మే 23 (విజయక్రాంతి) : కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగారును తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపేలా కేంద్రానికి విన్నవించాలని ప్రజాకవి గద్దర్ సతీమణి విమల గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు.

రాజ్ భవన్ లో  కుమార్తె వెన్నెల, దళిత నాయకుడు జెబీ రాజులతో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కగార్ లో ఆదివాసీలు ఎంతోమంది మృత్యువాత పడుతున్నారని అన్నారు.

దేశంపై దాడి చేసిన శత్రు దేశానికి చెందిన వారితో చర్చలకు సిద్ధపడ్డ ప్రభు త్వం, ఈ దేశంలోనే పుట్టి ఇక్కడి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వారితో చర్చలు జరపడంలో సమస్య ఏమిటంటే ప్రశ్నించారు. ఎన్‌కౌంటర్ చేయాల్సింది ఆదివాసి బిడ్డలను కాదని సమస్యలను ఎన్కౌంటర్ చేయాలని సూచించారు. తమ వినతిపత్రం అందుకున్న గవర్నర్ సానుకూలంగా స్పందించారని అన్నారని తెలిపారు. ఈ సమావేశం లో సిఎల్ యాదగిరి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.