calender_icon.png 2 February, 2026 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లోక్‌సభలో గందరగోళం.. రాహుల్ గాంధీ మైక్ కట్

02-02-2026 02:43:03 PM

రాహుల్ గాంధీ వ్యాఖ్యల దుమారం

న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) లడఖ్, డోక్లాం ఘటనపై ప్రస్తావించారు. దేశభక్తి ఎవరికి ఉందో ప్రజలకు తెలుసని రాహుల్ ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై లోక్ సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. రాహుల్ వ్యాఖ్యలను రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఖండిస్తూ ఆయన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంపై స్పీకర్ ఓం బిర్లా మాట్లాడాలని చెప్పారు. ఈ సందర్భంగా మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకంలోని అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించారు. రాహుల్ చెబుతున్న పుస్తకం ఇంకా పబ్లిష్ కాలేదని బీజేపీ నేతలు తెలిపారు.

ప్రచురించని పుస్తకంలో అంశాలపై రాహుల్ గాంధీ ఎలా మాట్లాడుతారు? అని రాజ్ నాథ్ సింగ్ ప్రశ్నించారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని పుస్తకంలోని వ్యాఖ్యాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. స్పీకర్ రూల్ బుక్ లోని నియమ నిబంధనలను చదివి వినిపించారు. తాను చెబుతున్నది వందశాతం నిజం అని రాహుల్ గాందీ వెల్లడించారు. రాహుల్ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. సభను అవమానించేలా రాహుల్ గాందీ మాట్లాడుతున్నారని అమిత్ షా(Amit Shah) ఆగ్రహం వ్యక్తం చేశారు.