calender_icon.png 6 September, 2025 | 5:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుడి శవం స్వాధీనం

06-09-2025 03:10:49 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి రైల్వే స్టేషన్(Bellampalli Railway Station) పరిధిలోని సోమగూడెం చర్చి వెనకాల రైలు పట్టాలపై గుర్తు తెలియని వృద్ధుని శవాన్ని శనివారం బెల్లంపల్లి జి ఆర్ పి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామగిరి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదవశాత్తు ఢీకొన్నట్లు తెలిపారు. మృతుని వద్ద ఇలాంటి ఆధారాలు లభించలేదని, నల్లని చుక్కలు గల ఎల్లో కలర్ ఫుల్ షర్ట్, సిమెంట్ కలర్ ప్యాంటు ధరించి బట్టతల కలిగి ఉన్నట్టు తెలిపారు. శవాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో గల మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు. సమాచారం తెలిస్తే 8712658601,9948481902 నెంబర్లకు సమాచారం అందించాలని కోరారు