calender_icon.png 6 September, 2025 | 6:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కష్టాలు

06-09-2025 03:15:19 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూరు మండలంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజామునుంచే క్యూలైన్ లో నిల్చుంటున్నారు. ఎక్కడ వచ్చిందంటే అక్కడికి పరుగులు పెడుతున్నారు. చాలామంది రైతులకు దొరకక నిరీక్షించివెనుదిరుగుతున్నారు. నాటు వేసిన తర్వాత నెలలో పే యూరియా వేయాలి.. సకాలంలో వాడకపోతే పంట ఎదుగు దలతోపాటు దిగుబడి తగ్గుతుంది. అయితే ఇప్పటికే పంటలేసి నెల రోజులు అవుతుందని.. యూరియా వేయకపోతే ఎదుగుదల లేక దిగుబడి తగ్గుతుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలు అన్ని ఇన్నికావు. శనివారం  కట్టంగూర్  మండల కేంద్రంలో రైతు వేదిక ,పిఎసిఎస్ కార్యాలయం వద్ద తెల్లవారుజాము నుండి రైతులు ఏరియా కోసం బారులు తీరుతు పడిగాపులు కాస్తున్నారు.

..రైతులు వ్యవసాయ పనులన్నీ వదులుకొని కుటుంబ సమేతంగా వచ్చి చెప్పులు క్యూలో లైన్లో పెట్టి యూరియా కోసం నిలుచున్నారు. క్యూలైన్లో నిలుచున్న యూరియా దొరకడం కష్టంగా మారింది. నాలుగు లోడ్ రావాల్సిన యూరియా ఒకే లోడ్ రావడంతో  రైతులుతీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు ఇదేమిటి అని రైతుల అధికారులనుప్రశ్నిస్తున్నారు. కట్టంగూర్ మండల వ్యాప్తంగా 22 గ్రామపంచాయతీ నుండి వందలాది మంది రైతులుయూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు వర్ధనాతీతం. పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న రైతు వేదిక వద్ద టోకెన్లు ఇస్తున్నారు. దీంతో పిఎసిఎస్ కార్యాలయం వరకు రావాలంటే కిలోమీటర్ రావాల్సి పరిస్థితి ఉన్నది దీంతో ముసలోళ్ళు రైతులు తీవ్రఇబ్బందులుగురవుతున్నారు.  రైతులకు సౌకర్యార్థంగా ఉంచి ఏరియా అందించాలని రైతులు విజ్ఞప్తి చేస్తామన్నారు. రైతులకు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని రైతులకు అవసరాలను అనుగుణంగా యూరియా అందించాలని సిపిఎం మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గుండాల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.