06-09-2025 03:07:06 PM
నకిరేకల్,(విజయక్రాంతి): రేపు7 రాత్రి 8.58 గం నుండి మరుసటి రోజు ఉ 2.25 గంట వరకు సంపూర్ణ చంద్రగ్రహణం బ్లడ్ మూన్ రక్త చంద్రుడు జరుగుతుందని. చందమామను వీక్షించండి.. అంధవిశ్వాసాలు విడనాడండి జనవిజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర సభ్యులు కనుకుంట్ల విద్యాసాగర్ కోరారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూఈ గ్రహణకాలంలో చంద్రుడు వివిధ దశలలో వివిధ రూపాలలో కనువిందు చేయనున్నాడని ఆయన తెలిపారు.
చంద్ర గ్రహణం రోజున, చంద్రుడిపై నేరుగా ప్రసరించే సూర్యకాంతిని మన భూమి నీడ అడ్డుకుంటుందని తెలిపారు. భూ వాతావరణపు పొరల గుండా ప్రయాణించేటప్పుడు వడపోతకు గురియైన సూర్య కాంతిలోని ఎరుపు రంగు తప్ప , మిగిలిన రంగులన్నీ భూ వాతావరణంలోనే చెదిరిపోయి కేవలం నారింజ & ఎరుపు రంగులు మాత్రమే చంద్రుడిపై ప్రసరిస్తాయని తెలిపారు. తిరిగి అవే నారింజ & ఎరుపు రంగులు భూమిపైకి పరావర్తనం చెందడంతో, అవే రంగులు మన కంటి వరకు చేరి, చంద్రుడు రక్త వర్ణం లో కనబడతాడుతాడని పేర్కొన్నారు.ఈ చంద్ర ఉపగ్రహ విన్యాసాలను చూడటం ఎంతో కనువిందుగా ఉంటుందని తెలిపారు. గ్రహణాల పట్ల ప్రజలలో నెలకొని ఉన్న మూఢనమ్మకాలని తొలగించే దిశగా ప్రజలకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. గ్రహణ కాలంలో చంద్రుడిని చూసేందుకు వీలుగా యువత, విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావి వర్గం కదిలి ఖగోళ జ్ఞానం కల్పించుటకు ఆకాశ దర్శనం (స్కై వాచ్) కార్యక్రమాలను నిర్వహించవలసినదిగా విజ్ఞప్తి చేశారు.. గ్రహణ వీక్షణం పట్ల ప్రజలలో నెలకొని ఉన్న భయాలను తొలగించేందుకు కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.