06-09-2025 03:08:57 PM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఆదేశించారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరాలతో వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, ర్యాట్ పరీక్షలో పాజిటివ్ వస్తె రక్త నమినాను ఎలిజా పరీక్షకు పోయించాలని వైద్యులను ఆదేశించారు. ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని గుర్తించడం వల్ల మెరుగైన వైద్యం అందించవచ్చు.
జిల్లాలోని గురుకుల పాఠశాలలు, సంక్షేమ పాఠశాలలు, కే.జి.బి.వి లు, అన్ని వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి రోజు కొన్ని పాఠశాలల చొప్పున అందరికీ ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది లేదా మరేదైనా సమస్యలు ఉంటే ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు సరైన వైద్యం, గర్భిణీలకు సమయానుసారం పరీక్షలు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా శ్రీనివాసులు, మెడికల్ ఆఫీసర్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.