22 May, 2026 | 8:14 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

ముఖ గుర్తింపుతో పెన్షన్ అక్రమాలకు చెక్

30-07-2025 11:59 PM

వృద్ధులకు, వేలిముద్రలు రాని వారికి ఈ యాప్ ఎంతో ప్రయోజనం 

కలెక్టర్ పి.ప్రావీణ్య

సంగారెడ్డి, జూలై 30(విజయక్రాంతి): ముఖ గుర్తింపు యాప్ ద్వారా పెన్షన్లు ఇవ్వడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య అన్నారు. బుధవారం సంగారెడ్డి మున్సిపల్ పరిధిలోని పోతిరెడ్డిపల్లి వార్డు కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు.

వృద్ధులు వికలాంగులు, ఒంటరి మహిళ లకు ప్రభుత్వం ఆర్థికంగా చేయూతని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ప్రభుత్వ చేయూత పెన్షన్లను ముఖ గుర్తింపు ప్రత్యేక ఆప్ ద్వారా అందజేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈముఖ గుర్తింపు యాప్ తో పెన్షన్లు ఇవ్వడం వల్ల వృద్దులు వేలిముద్రలు రాని వారికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు.

ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు చెందిన వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు చేయూత ఇవ్వాలని ఉద్దేశంతో చేయూత పథకం వలన ప్రతి నెలా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను ప్రభుత్వం అందజేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు బిల్ కలెక్టర్లు, బ్రాంచ్  పోస్ట్  మాస్టర్ ద్వారా  నూతనంగా ప్రభుత్వం రూపొందించిన ముఖ గుర్తింపు ప్రత్యేక యాప్ ద్వారా పెన్షన్ అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కొత్త విధానంలోనే పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పింఛన్ విభాగం సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంపిణీ పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఈ వినూత్న ప్రయోగం ద్వారా  పింఛన్ లబ్ధిదారులకు నిత్య అవసరాలకు నిధులు సకాలంలో అందేలా అధికారులు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో సూర్య రావు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి,  సంబంధిత అధికారులు పాల్గొన్నారు.