calender_icon.png 1 August, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనమహోత్సవంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

31-07-2025 12:00:00 AM

ఖమ్మం, జూలై 30 (విజయ క్రాంతి):నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణ లో నిర్వహించిన వన మహోత్సవం కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచా ర పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం పా ల్గొని మొక్కలు నాటారు.మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తోపాటు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు పాల్గొన్న ఈ కార్యక్రమం లో మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి అవి పెరిగే వరకు కృషి చేయాలని అన్నారు.

అనంతరం నేలకొండపల్లి మండల వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణ లో మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన నూతన రేషన్ కార్డులను జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి అందజేశారు. ప్రతి రోజు పేదల ముఖంలో చిరునవ్వు ఉండేలా తెలంగాణ రాష్ట్రంలో పాలన సాగుతోందని అన్నారు. ప్రతి ఇంటికి మహిళలు మహాలక్ష్మి లుగా ఎన్ని కష్టాలు వచ్చినా ఇండ్లను ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్తారని అన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీ సీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం క ల్పించిందని, ఇందిరమ్మ ఇండ్లను కూడా మ హిళల పేరిట ప్రభుత్వం అమలు చేస్తున్నదని అన్నారు.

గతంలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో లక్ష మంది మహిళలను లక్షాధికారులు చేస్తామనీ మాట ఉండేదని,  ప్రస్తు తం కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నా రు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పో యిన ఆర్థిక సంవత్సరంలో సున్నా వడ్డీతో 25 వేల కోట్ల రూపాయలు 65 లక్షల మంది మహిళ సంఘాల మహిళలకు అందించామని అన్నారు. గడిచిన 4 నెలల్లో మహిళ లకు ప్రజా ప్రభుత్వం సున్నా వడ్డీ క్రింద 855 కోట్లు మహిళా సంఘాలకు విడుదల చేశామని అన్నారు.

ఈ కార్యక్రమాల్లో డివిజనల్ పంచాయతీ అధికారి రాంబాబు, ఆ ర్డీఓ నరసింహా రావు, తహసీల్దార్ వెంకటేశ్వ ర్లు, ఎంపీడీఓ ఎర్రయ్య, నేలకొండపల్లి మా ర్కెట్ కమిటి చైర్మన్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపా ల్ ఏ.పరంజ్యోతి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, సంబం ధిత అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.