10-07-2025 01:25:55 AM
- శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ నిర్వాకం
ముంబై, జూలై 9: పప్పు బాగాలేదని చెఫ్‌ను ఎమ్మెల్యే చితక్కొట్టిన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైలో చోటుచేసుకుంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఆకాశవాణి ఎమ్మెల్యే రెసిడెన్స్‌లో ఉంటున్నారు. అక్కడి క్యాంటీన్‌లో భోజనం చేసేందుకు వెళ్లారు. పప్పు, చపాతీతో పాటు రైస్ కావాలని ఆర్డర్ చేశారు.
అయితే పప్పు నుంచి దుర్వాసన రావడంతో ఆయన కోపం పట్టలేకపోయారు. ఒక ఎమ్మెల్యేకు ఇలాగే వడిస్తా రా? నాకే ఇలాంటి వంట పెడితే మిగతావారి పరిస్థితి ఏంటి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అనంతరం క్యాంటీన్ ఆపరేటర్ ముఖం పై సంజయ్ గైక్వాడ్ పంచుల వర్షం కురిపించాడు. ఇందులో విచారించాల్సిన అవసరం లేదన్నారు. అజ్ఞానులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని మా అధినేత బాల్ ఠాక్రే నేర్పించారు.