calender_icon.png 11 July, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్సైజ్ శాఖ కల్లు దుకాణాదారులతో కుమ్మక్కైంది

10-07-2025 02:19:02 PM

హైదరాబాద్: కూకట్ పల్లి కల్తీ కల్లు తాగి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో ఇప్పటికి ఆరుగురు చనిపోయారు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు స్పందించారు. కల్తీ కల్లు తగిన వారిలో కొందరికి కిడ్నీలు దెబ్బతిన్నాయని, ప్రమాదకర రసాయనాలు, మత్తుపదార్థాల విక్రయంపై నిఘా లేదని ఆరోపించారు. ఎక్సైజ్ శాఖ కల్లు దుకాణాదారులతో కుమ్మక్కైందని ఆయన విమర్శించారు. ఎక్సైజ్ శాఖ అధికారులు రోజూ తనిఖీలు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రామచంద్ర రావు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, ఆసుపత్రి పాలైన బాధితులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కూకట్ పల్లి కల్తీ కల్లు తాగిన ఘటనలో మొత్తం 37 మంది అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో మరో ఆరుగురు బాధితులు ఆస్పత్రుల్లో చేరారు. మరో 31 మంది బాధితులు నిమ్స్ ఆసుపత్రిలో(NIMS Hospital) చికిత్స పొందుతున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్న వారిలో 27 మంది ఆరోగ్యం నిలకడగా ఉందని, నలుగురి పరిస్థితి విషమంగా ఉందని, వారికి డయాలసిస్ చేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు.