10-07-2025 01:05:40 PM
ఏలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు(Eluru) వంగాయగూడెంలోని క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఫర్నిచర్ గోడౌన్‌లో గురువారం ఉదయం షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద అగ్నిప్రమాదం(Fire Breaks Out) సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. పెద్ద ఎత్తులు మంటలు రావడంతో గురువారం మధ్యాహ్నం దట్టమైన పొగ ఆకాశాన్ని కప్పేశాయి. ఈ భారీ అగ్నిప్రమాదం ఘటన స్థానికుల్లో భయాందోళనలు సృష్టించింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్(Short circuit) కారణమని అధికారులు నిర్ధారించగా, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని నివేదికలు పేర్కొన్నాయి. స్థానికుల సమాచారంతో నాలుగు ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.