10-07-2025 12:57:30 PM
నాగర్‌కర్నూల్, (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో ఈ నెల 11న శుక్రవారం రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ(Damodar Raja Narasimha), కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, పార్లమెంటు సభ్యుడు మల్లురవిలు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసేందుకు పర్యటించనున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayan Reddy), నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే కూచకుల్ల రాజేష్ రెడ్డి లు తెలిపారు. రూ.189 కోట్లతో కల్వకుర్తి నియోజకవర్గం కొట్ర గేట్ నుండి కల్వకుర్తి పట్టణానికి నాలుగు వరుసల రహదారి, పట్టణంలో వంద పడకల ఆసుపత్రి, వెల్దండ నుండి సిరసనగండ్లకు, కొట్ర తండా నుంచి తలకొండపల్లి మార్గంలో రెండు వరసల రోడ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
మాడుగుల మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసి 220 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు అందజేయనున్నట్లు తెలిపారు. పట్టణంలో మహిళా సంఘాలకు బ్యాంకు నుండి ఆరు కోట్ల రుణాలు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం, తుడుకుర్తి గ్రామంలో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపనలు మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మంత్రుల పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ గురువారం ఆయా శాఖల అధికారులను అప్రమత్తం చేశారు.