10-07-2025 01:26:56 AM
నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాల సంతకాలు
విండ్‌హోక్, జూలై 9: నమీబియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. దేశ రాజధాని విండ్‌హోక్‌ను సందర్శించిన మోదీకి నమీబియా అధ్యక్షురాలు నెతుంబో నంది ద్వైత్వా ‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్‌విట్షియా మిరాబిలిస్’ పురస్కారాన్ని అందించారు. 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచి మోదీకి ఇది 27వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషం.
ఐదు దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన నమీబియాలో పర్యటించిన ప్రధా ని మోదీ ఈక్రమంలో బుధవారం నమీబి యా అధ్యక్షురాలితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఆరోగ్య సంరక్షణ, ఇంధనం తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకునేందుకు ఇరుదేశాలు నాలుగు ఒప్పందాల పై సంతకం చేశాయి. అనంతరం ప్రధాని మోదీ నమీబియా పార్లమెంట్‌లో ప్రసంగించారు. భారత్ మధ్య దౌత్య స ంబంధాలను, సంప్రదాయాలను సభకు వి వరించారు.
ఎక్కువ విదేశీ పార్లమెంట్లలో మాట్లాడిన భారత ప్రధానిగా మోదీ రికార్డులకెక్కారు. ఇప్పటివరకు మోదీ 17 విదేశీ పా ర్లమెంట్లలో ప్రసంగించడం విశేషం. రాజధా ని విండ్‌హోక్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది. విమానాశ్రయం లో ఆ దేశ అధ్యక్షురాలు నెతుంబో స్వయం గా మోదీని ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సంప్రదాయ స్వాగత కార్యక్రమాలు అలరించాయి.
అక్కడి కళాకారులతో కలిసి మోదీ కూడా డప్పు కొడుతూ వారిని ఉత్సాహపరిచారు. నమీబియా దేశ అధ్యక్షురాలి ఆహ్వానం మేరకు ఆ దేశంలో ప ర్యటిస్తున్న మోదీ ఆఫ్రికన్ దేశానికి వెళ్లిన మూడో ప్రధానిగా నిలిచారు. జూలై 2 నుంచి మోదీ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీ నా,బ్రెజిల్,నమీబియాలో పర్యటించారు. నేడు మోదీ భారత్‌కు తిరిగి రానున్నారు.