10-07-2025 01:25:13 AM
పట్నా, జూలై 9: బీహార్‌లో ప్రతిపక్షాల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో నితీశ్ కుమార్ పార్టీ తమకు అనుకూలమైన వారి ఓట్లు మాత్రమే జాబితాలో ఉండేలా మార్పులు చేస్తోందని విమర్శించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్) నిర్వహించాల న్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ‘బీహార్ బంద్’కు పిలు పునిచ్చాయి.
ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి బంద్‌లో పాల్గొన్న రాహుల్ గాంధీ సంయుక్తంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడు తూ.. లోక్‌సభకు, మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ముందుగా ఇండియా కూటమికి మెజారిటీ ఉన్నట్టు పలు సర్వేలు వెల్లడించాయన్నారు. కానీ అనుకోకుండా తాము ఓట మి పాలయ్యామని.. అనంతరం ఓటర్ల జాబితాను పరిశీలించగా ఎన్నికలకు వారం రోజు ల ముందే దాదాపు కోటి మంది కొత్త ఓటర్లను చేర్చినట్టు గుర్తించామన్నారు. బీహార్ లోనే అదే కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నా రు.
మహారాష్ట్ర ఎన్నికల తర్వాత తాము ఓట ర్ల జాబితా అడిగినప్పటికీ ఎన్నికల కమిషన్ అధికారులు ఇప్పటివరకు దానిని తమకు అందించలేదన్నారు. ఆధార్ ఎప్పుడు తొలి గుర్తింపు కాదని ఉడాయ్ సీఈవో భు వ నేశ్వర్ కుమార్ వెల్లడించారు. ఫేక్ ఆ ధా ర్ కార్డుల గుర్తింపుపై పరిశీలిస్తున్నామన్నారు. కాగా బీహార్ బంద్‌కు కా ంగ్రెస్, ఆర్జేడీ, వా మపక్షా లు, వికాశ్‌శీల్ ఇన్సాన్ పార్టీ , స్వతం త్ర నేత పప్పు యాదవ్‌తో కూడిన మహాఘట్‌బంధన్ మద్దతు ప్రకటించింది.
ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై మహాఘట్‌బంధన్ రాష్ట్ర వ్యాప్తంగా ‘చక్కా జామ్’ నిర్వహించింది. హాజీపూర్, సోన్‌పూర్‌లలో ఆర్జేడీ కార్యకర్తలు టైర్లను కాల్చి రోడ్ల ను దిగ్బంధించారు. హాజీపూర్‌లోని గాంధీ సేతును ఆర్జేడీ మద్దతుదారులు అడ్డుకోగా, సోన్‌పూర్‌లో స్థానిక ఎమ్మెల్యే ముఖేశ్ రోష న్ ఆందోళనకు నాయకత్వం వహించారు.