calender_icon.png 5 November, 2025 | 10:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సహస్ర దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న చేగుంట ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి

05-11-2025 09:03:37 PM

చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండల పట్టణ కేంద్రంలో ప్రజలు కార్తీక పౌర్ణమి వేడుకలను బుధవారం అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా ప్రజలు దేవాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ కేంద్రంలో గల హనుమాన్ ఆలయంలో ఎస్ఐ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్బంగా ఏర్పాటు చేసినటువంటి సహస్త్ర దినోత్సవం, దీపారాధన, ద్వాదశ జ్యోటిర్లింగాలకు భక్తుల అభిషేకాలు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎస్సై కుటుంబ సభ్యులకు ఆలయ పూజారి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించారు, సాయంత్రం వేళ మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయాల వద్దకు చేరుకొని కార్తీక దీపాలను వెలిగించారు. అలాగే తమ గృహాల వద్ద, కార్తీక దీపాలు వెలిగించారు. భక్తులు కుటుంబ సభ్యులతో ఆలయాలకు చేరుకోవడంతో ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఈ కార్యక్రమంలో అయిత పరంజ్యోతి, రఘు రాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.