05-11-2025 10:18:06 PM
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం, మట్టపల్లి మహాక్షేత్రం నందు బుధవారం శ్రీ స్వామి వారికి ప్రాతఃకాలమున నిత్యాభిషేకములు, నిత్య హోమములు జరిగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా స్థానిక శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు శ్రీ స్వామి వారికి విశేషంగా మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకములు, పూజా అర్చన కార్యక్రమములు అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కార్తీక దీపారాధన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాయంత్రం 7:00 గంటలకు దేవస్థాన అర్చకులచే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణము అత్యంత వైభవముగా నిర్వహించబడినది. కార్యక్రమంలో దేవస్థానం అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయకుమార్, దేవస్థాన అర్చకులు, సిబ్బంది భక్తులు పాల్గొన్నారు.