05-11-2025 10:08:59 PM
క్యాండిల్ ర్యాలీ నిర్వహణ..
తాండూర్ (విజయక్రాంతి): చేవెళ్ల వద్ద జరిగిన దుర్ఘటనలో తాండూర్‌కు చెందిన 13 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు సంఘీభావంగా వికారాబాద్ జిల్లా తాండూర్ పౌర సమాజం ఆధ్వర్యంలో ఈరోజు సాయంత్రం అంబేద్కర్ చౌక్ నుండి ఇందిరా చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పౌరులు, వాలంటీర్లు, సామాజిక సేవా సంస్థలు, విద్యార్థులు సహా అనేక మంది ర్యాలీలో పాల్గొని మృతులకు నివాళులర్పించారు.