calender_icon.png 6 November, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీ..

05-11-2025 10:20:47 PM

ఒకరి మృతి ఇద్దరికి తీవ్ర గాయాలు..

బేల (విజయక్రాంతి): ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బేల మండల కేంద్రంలో లోని గణేష్ గార్డెన్ ఎదుట జాతీయ రహదారిపై బుధవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బేలకు చెందిన  శ్రీకాంత్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.