calender_icon.png 5 November, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడలో ఎం.ఎం సోలార్ సొల్యూషన్స్ ప్రారంభం

05-11-2025 10:14:29 PM

కోదాడ: ప్రజలు సోలార్ విద్యుత్తును వినియోగించుకొని విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవాలని టిపిసిసి డెలిగేట్ సిహెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మాజీ సర్పంచ్ ఎర్నేని బాబు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహబూబ్ జానీ, మాజీ జిల్లా కోఆప్షన్ సభ్యులు, అల్తాఫ్ హుస్సేన్ లు అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలోని నయా నగర్ చిన్న మసీదు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎం.ఎం సోలార్ సొల్యూషన్స్ ను వారు ప్రారంభించి మాట్లాడారు. సోలార్ అపెక్స్ తో సౌర విద్యుత్తును సులభతరం చేస్తుందన్నారు. సౌర విద్యుత్తు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 78 వేల రూపాయల వరకు సబ్సిడీ ఇస్తుందన్నారు.

ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఎం ఎం సోలార్ సొల్యూషన్స్ వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నారు. యువత ఆధునిక వ్యాపారాలను ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎం ఎం సోలార్ సొల్యూషన్స్ నిర్వాహకులు షేక్ మోసిన్, ఎపెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ షోహబ్ అలీ, కో ఫౌండర్ మహమ్మద్ నాజీమ్ షరీఫ్, సేల్స్ హెడ్ షకీబ్ ,ఇర్ఫాన్, నాయకులు మహబూబ్ జానీ, అల్తాఫ్ హుస్సేన్, కందుల కోటేశ్వరరావు, షేక్ షఫీ, షాబుద్దీన్, గంధం యాదగిరి, భాజాన్,జహీర్, మహమూద్, అంబటి కర్ర శ్రీనివాసరావు కంపెనీ ప్రతినిధులు స్థానిక యువకులు తదితరులు పాల్గొన్నారు.