05-11-2025 10:11:04 PM
తరలివచ్చిన భక్తులు..
అలంపూర్: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ప్రముఖ శైవ క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదవ శక్తిపీఠం అలంపూర్ శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం రాత్రి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి పురస్కరించుకుని జ్వాలా తోరణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ సమీపంలో ఉన్న తుంగభద్ర పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు అర్చకుల వేదమంత్రోచ్చరణ నడుమ విశేష పూజలు నిర్వహించారు. జ్వాలతోరణం చుట్టూ స్వామి అమ్మవార్ల పల్లకిని ప్రదక్షిణలు చేయించారు. ఈ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు. అనంతరం తుంగభద్ర నదీమాతల్లికి హారతిని ఇచ్చారు.