05-11-2025 08:49:44 PM
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం పరిదిలోని రాంపూర్ కన్యారం గ్రామ శివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దౌల్తాబాద్ మండల్ ఉప్పరపల్లి గ్రామానికి చెందిన డెలివరీ బాయ్ క్యగారి హరికృష్ణ(28) కి తీవ్ర గాయాలయ్యాయి. తాను చేగుంటలోని డెలివరీ పార్శిల్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ యువకుడు ద్విచక్రవాహనంపై వెత్తుండగా ఒక్కసారిగా అడ్డొచ్చిన గేదెను ఢీకొన్నాడు. ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.