calender_icon.png 5 August, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా విద్యాశాఖ అధికారిగా నాగలక్ష్మి

05-08-2025 12:46:19 AM

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 4, (విజయ క్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యాశాఖ అధికారిగా జడ్పీ సీఈవో నాగలక్ష్మి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఐ డి ఓ సి లో గల విద్యాశాఖ కార్యాలయంలో అదనపు బాధ్యతలు స్వీకరించారు.గత నెల 31న డి ఈ ఓ గా బాధ్యతలు నిర్వహించిన వెంకటేశ్వర చారి పదవీకాలం ముగియడంతో ఆ పోస్ట్ ఖాళీ ఏర్పడింది. జిల్లాలో డీఈఓ పోస్టుని ప్రత్యామ్నాయ పద్ధతిలో భక్తి చేయాలని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ జిల్లా అధికారి హితేశ్వి పాటలను ఆదేశించారు. దీంతో జడ్పీ సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్న నాగలక్ష్మి ని జిల్లా విద్యాశాఖ అధికా రిగా నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.