24 July, 2026 | 3:24 AM

టెన్త్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్

28-06-2024 03:38 PM

హైదరాబాద్‌: తెలంగాణ టెన్త్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను bse.telangana.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫలితాలు ప్రకటించారు.  విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నెంబరు నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. సప్లిమెంటరీ పరీక్ష‌ల్లో 73.03 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఇందులో బాలురు ఉత్తీర్ణ‌త 71.01 శాతం కాగా, బాలికల ఉత్తీర్ణ‌త‌ 76.37 శాతంగా న‌మోదైంది. ఇక పదోతరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు జూన్‌ 3 నుంచి జూన్ 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఈ ప‌రీక్ష‌ల‌కు మొత్తం 51, 237 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.