calender_icon.png 8 November, 2025 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో పదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం..

08-11-2025 06:33:06 PM

మార్కెట్ చైర్మన్ గంగారెడ్డి..

బోథ్ (విజయక్రాంతి): ప్రజారంజకంగా ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని మార్కెట్ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి పేర్కొన్నారు. శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో జరుపుకున్నారు. కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. కాంగ్రెస్ నాయకులు రైతులతో కలిసి సామూహిక భోజనాలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆడే వసంత్ రావు,చంటి ఉమేష్ మహేందర్ పోతన్న శంకర్ దాస్ అచ్యుతానంద అనిల్ అప్ప, గడ్డల నారాయణ, సుద్దుల స్వామి, మందుల రమేష్, కౌసర్, రవినాయుడు, వోటర్ కార్ రాజశేఖర్, కురుమే గంగారాం, అత్రం సుశీల, రూపేష్ జాదవ్, అన్నమయ్య, కనక యాదవరావు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, పలువురు నాయకులు పాల్గొన్నారు.