08-11-2025 06:30:20 PM
కందుకూరు (విజయక్రాంతి): కందుకూరు మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ వైస్ ఎంపీపీ గంగుల శమంతా ప్రభాకర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ మండల్ కో-ఆర్డినేటర్ యండి అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. విద్యార్థులకు నాయకులు కేక్ తినిపించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఈ సందర్బంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కందుకూరు మాజీ ఉప సర్పంచ్ గుండ్ర సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సురసాని విట్టల్ రెడ్డి,సీనియర్ నాయకులు నర్సింహా ,గడిగే రాములు గౌడ్,మర్ల రాములు యాదవ్,ఎగ్గిడి జగదీష్ కుర్మ, ఉపాధ్యాయులు భార్గవి, విమల, శ్రావణి, రమాదేవి, భవాని, అమృత, సుగుణ, మంజుల, అనురాధ, సద్గుణ, ప్రమోద, శ్రవంతి, విద్యార్థులు పాల్గొన్నారు.