calender_icon.png 8 November, 2025 | 8:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంపీఎఫ్ పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రత్యేక క్యాంపు

08-11-2025 06:36:44 PM

ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రామ చందర్..

మణుగూరు (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ 4.0 లో భాగంగా సింగరేణి సీఎంపీఎఫ్ పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ ప్రత్యేక క్యాంపును నిర్వహిస్తున్నట్లు జీఎం దుర్గం రామచందర్ శనివారం తెలిపారు. సోమవారం పీవీ కాలనీ కమ్యూనిటీ హాల్ నందు క్యాంప్ జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్యాంపును పెన్షనర్లు, సి‌పి‌ఆర్‌ఎం‌ఎస్ కార్డు దారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పెన్షనర్లు ఆధార్, పాస్‌బు‌క్‌ తో ఉదయం 10:30 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.