13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

చిన్నారులకు పోషకాహారం అందిస్తాం

27-03-2026 02:08 AM

ప్రయోగాత్మకంగా 29 స్కూళ్లలో అమలుకు పరిశీలించాలి 

అధికారులకు ముఖ్యమంత్రి  రేవంత్‌రెడ్డి ఆదేశం 

సీఎంతో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ భేటీ 

సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష

హైదరాబాద్, మార్చి 26 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ గురువారం సీఎం రేవంత్ రెడ్డితోభేటీ అయ్యారు. శాసనమండలి హాల్‌లో గురువారం జరిగిన సమా వేశంలో పలు అంశాలపై వారు చర్చించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో 0- 10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం.. విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను ఆయన సీఎంకు సూచించారు. ఈ సందర్భంగా సీఎం స్పందిస్తూ ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు వివరించారు. అంగన్‌వాడీల్లో కార్యక ర్తలు, ఆయాలతో పాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమిం చాలని కార్తీక్ మురళీధరన్ సీఎంకు సూచించారు.

అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కార్తీక్ మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచిం చారు. కార్తీక్ మురళీధరన్‌తో సమన్వయం చేసుకొని ఈ అంశంపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. 

సమీక్షలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సెర్ప్ సీఈవో దివ్య, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శ్రుతి ఓజా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.