13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

టీఆర్పీలో భారీగా చేరికలు

27-03-2026 02:10 AM

మెదక్, వనపర్తి జిల్లాల నుంచి పలు పార్టీల నేతలు, కార్యకర్తల రాక

పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించిన టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, మార్చి 26(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)బలోపేతమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా చేరికలు  కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం మెదక్, వనపర్తి జిల్లాల నుంచిపెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తెలంగా ణ రాజ్యాధికార పార్టీలో చేరారు. రాష్ట్ర కార్యదర్శి నగేష్ ముదిరాజ్, మెదక్ జిల్లా అధ్యక్షు లు యాదగిరి గౌడ్, వనపర్తి జిల్లా అధ్యక్షులు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్పీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరినీ టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, బీసీ ప్రజలకు రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ విధానాలకు ఆకర్షితులై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, యువత పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. కొత్తగా చేరిన వారందరూ పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపుని చ్చారు.  కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వట్టె జానయ్య యాదవ్, పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, టీఆర్పీ రాష్ట్ర నాయకులు బయ్యా వెంకటేష్ యాదవ్ , మెదక్, వనపర్తి జిల్లాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.