calender_icon.png 31 July, 2025 | 5:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రీడాకారిణులను సన్మానించిన గుమ్ముల మోహన్ రెడ్డి

30-07-2025 10:18:58 PM

నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): నార్వేలో జరుగుతున్నటువంటి స్లంసాకర్ హోమ్ లెస్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్(Slum Soccer Homeless International World Cup)కి నల్లగొండ జిల్లా నుండి ఎన్నిక కాబడిన క్రీడాకారినీ లావణ్యను, ఫిఫా అకాడమీకి ఎన్నిక కాబడిన క్రీడాకారిణి పవిత్రను బుధవారం జిల్లా కేంద్రంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఫుట్బాల్ కోచ్ కే. దాసు, సునీత, రజిత, రఫీ జాతీయస్థాయి క్రీడాకారులు సిద్ధార్థ, సోనీ, సాగర్ పాల్గొన్నారు.