22 March, 2026 | 10:36 AM

తిరుపతిలో చిన్నారిపై అత్యాచారం, హత్య

03-11-2024 01:57 AM

 సమీప బంధువు దారుణం

తిరుపతి, నవంబర్ 2: తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో శుక్రవారం రాత్రి దారుణం జరిగింది. మండలంలోని ఓ గ్రామానికి చెందిన సుశాంత్ (22).. తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారిపై అఘా యిత్యానికి పాల్పడ్డాడు. చాక్లెట్లు ఇప్పిస్తానని  సమీప పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చంపేసి పూడ్చిపెట్టాడు.

చీకటైనా పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుశాంత్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా ఘటన వెలుగుచూసింది. నిందితుడి సమాచారంతో చిన్నారి మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్‌మార్టంకు  తరలించారు. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. చిన్నారి కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు.