14-07-2025 12:00:00 AM
తిమ్మాపూర్, జూలై 13(విజయక్రాంతి): తిమ్మాపూర్ మండల కేంద్రానికి చెందిన బూర్ల రాజేందర్ ఆకస్మిక మరణం చెందాడు. విషయం తెలుసుకున్న 1999-2000 ఎస్‌ఎస్సి బ్యాచ్ చెందిన బాల్య స్నేహితులు42000/-రూపాయలు రాజేందర్ భార్య బూర్ల శ్రీవాణికి ఆదివారం అందించారు, ఇకముందు వీరికి అండగా ఉంటామని, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో తాటిపాముల రాము, బొర్ర శ్రీధర్, గోపగోని రాజు గౌడ్, అడిచెర్ల సతీష్, చంద్రమౌళి, పబ్బ శ్రీనివాస్, సురేష్, రమేష్, శోభారాణి, కవిత, వనజ, వారి కుటుంబ సభ్యులుపాల్గొన్నారు.