calender_icon.png 14 July, 2025 | 8:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా న్యాయం చేయాలి

13-07-2025 11:34:37 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల ప్రజలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మి(MLA Kova Laxmi) అన్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవ లక్ష్మి మాట్లాడుతూ.. పేద ప్రజలు అనారోగ్యం కారణంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి ప్రభుత్వం కనీసం 50 శాతం వరకు ఆర్థికంగా సహాయం అందించాలని కోరారు. అప్పులు చేసి మరి ప్రైవేట్ ఆస్పత్రిలలో వైద్యం చేసుకుంటున్నా బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు కుందారపు శంకరమ్మ, మాజీ సర్పంచ్ భీమేష్ తదితరులున్నారు.