14-07-2025 12:00:00 AM
బిచ్కుంద, జులై 13 ( విజయక్రాంతి); కామారెడ్డి జిల్లా బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఎం.రవి కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఐజి ఆఫీస్ నుంచి ఆయనను బదిలీపై బిచ్కుంద సీఐగా ప్రభుత్వం నియమించింది. సిఐ గా బాధ్యతలు స్వీకరించిన రవికుమార్ అనంతరం ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. గుట్కా, పేకాట, గంజాయి పై, ఉక్కు పాదం మోపనున్నట్లు తెలిపారు. దీనికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇదివరకు బిచ్కుంద సీఐగా పనిచేసిన జగడం నరేష్ ని ఐజీ కార్యాలయానికి బదిలీ చేశారు.