14 April, 2026 | 2:00 PM

బావిలో నుంచి చిన్నారి మృతదేహం వెలికితీత

26-06-2025 12:20 AM

రాజేంద్రనగర్, జూన్ 25: పోలీసులు బావిలో పడిన చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. మైలార్దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీగూడ సమీపంలో ఆర్ జి కే వద్ద మంగళవారం ఉదయం చంద్రకుమార్ కొ డుకు ఐదేళ్ల చిన్నారి ప్రిన్స్ కుమార్ ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడిన విషయం తెలిసిందే.

ఇన్స్పెక్టర్ నరేందర్ ఆధ్వర్యంలో డిఆర్ ఎఫ్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో అతి కష్టం మీద బుధవారం ఉద యం చిన్నారి మృతదేహాన్ని వెలికి తీశారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచేస్తున్నారు.