calender_icon.png 26 July, 2025 | 12:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మునగ తోటల నిర్వహణపై రైతులకు కీలక సూచనలు

26-06-2025 12:20:46 AM

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 ,(విజయక్రాంతి); జిల్లాలో నవంబర్-డిసెంబర్ మాసాల్లో నాటిన మునగ తోటలు ప్రస్తుతం పూత, కాయల దశలో ఉండటంతో, ఈ దశలో సరైన పర్యవేక్షణ లేకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ రైతులకు సూచించారు. బుధవారం పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు రైతులు తీసుకోవలసిన చర్యలపై వ్యవసాయ శాఖ నిపుణులతో కలిసి కలెక్టర్ చర్చించారు.

ఈ సందర్భంగా ఆయన రైతులకు పలు కీలక సూచనలు చేశారు: నీటి నిల్వ నివారణ: వర్షాకాలంలో తోటల్లో నీరు నిలవకుండా చూడాలి. మీరు నిల్వ ఉంటే మొక్కల వేర్లు కుళ్ళిపోవడం, తెగుళ్లు వ్యాపించడం జరుగుతుంది కాబట్టి నిల్వకుండా చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికిగాను  ఉపాధి హామీ పథకం కింద 12x12 మీటర్ల నీటి కుంటలు తవ్వించుకోవాలి. లేకపోతే రైతులు స్వయంగా చిన్న గుంటలు (3x3 మీటర్లు) తవ్వి నీరు పారేలా చర్యలు తీసుకోవాలి అన్నారు.

తేమ నిర్వహణ:వర్షాల మధ్య ఎండలు పడటం వల్ల తోటలో తేమ లోపించే అవకాశం ఉంది. కాయల దశలో తేమను నిలుపుకోవడం అత్యవసరం. తేమ/ నీరు సరైన స్థాయిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి . ఎరువుల వినియోగం: పుష్పోత్పత్తి , కాయల అభివృద్ధి దశలో మొక్కలకు పశువుల ఎరువు (5-10 కేజీలు), యూరియా (100 గ్రా), పొటాష్ (50 గ్రా) ఇవ్వాలి. లేదా డ్రిప్ ద్వారా నీటిలో కరిగే ఎరువులు 19:19:19 లేదా 13:0:45 వారానికి ఒకసారి ఇవ్వాలని సూచించారు. కలుపు నివారణ: పోషకాలు కలుపులకు పోకుండా, ప్రతి వారం తోట పరిశీలించి కలుపును తొలగించాలి.

పురుగు నియంత్రణ: ఆకులను తినే గొంగళి పురుగుల నియంత్రణకు ( 15 రోజులకు ఒకసారి ) వేప కషాయం పిచికారి చేయాలి. అవసరమైతే నిపుణుల సూచనల మేరకు  వంటివి వినియోగించాలి. తెగుళ్ల నివారణ: ఆకుమచ్చ తెగుళ్ల నియంత్రణకు వేప నూనె 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి. కార్బన్డైజమ్ మ్యాన్కోజబి వంటి మందులు నిపుణుల సలహాతో వాడాలని సూచించారు. సూచనలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.