calender_icon.png 28 October, 2025 | 3:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిలుకూరు పీఏసీఎస్‌కు తాళం

26-09-2024 01:08:23 AM

కోదాడ, సెప్టెంబర్ 25: రుణమా ఫీ కాని రైతులు ఆగ్రహంతో సూర్యా పేట జిల్లా చిలుకూరు పీఏసీఎస్‌కు బుధవారం తాళం వేశారు. సంఘం పరిధిలోని 45 మంది రైతులకు రు ణమాఫీ కాలేదని, ఈ విషయాన్ని పీ ఏసీఎస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నా స్పందన లేదని రైతులు చెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన రైతులు కా ర్యాలయంలో సిబ్బంది ఉండగానే తాళం వేశారు.

రూరల్  సీఐ రజితారెడ్డి సొసైటీ వద్దకు చేరుకొని రైతుల కు సర్దిచెప్పారు. సీఈవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. నూతనంగా రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించలేదని, సమస్య పరిష్కా రం కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు తాళం తీశారు.