25 August, 2026 | 3:40 AM

చిలుకూరును డైరీహబ్‌గా తీర్చిదిద్దాలి

25-08-2026 12:00 AM

ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి

కోదాడ (చిలుకూరు) ఆగస్టు 24: చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలని, ఇందుకు తన వంతు సహయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి అన్నారు. సోమవారం చిలుకూరు లో గ్రామీణ ప్రాంతాల రైతుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా నాబార్డ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన భానుపురి డైరీ రైతు ఉత్పత్తిదారుల మాక్స్ లిమిటెడ్ కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ పాడి రైతులందరూ ఈ సంస్థలో సభ్యులుగా చేరి నాబార్డ్ అందించే రాయితీలు, సేవలను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా రైతులు అభివృద్ధి చెందాలని కోరారు. పాలను వివిధ ఉత్పత్తులుగా మార్చి విక్రయించడం ద్వారా రైతులకు అధిక లాభాలు వస్తాయని ఆమె వివరించారు. డీడియం రవీంద్ర నాయక్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల రైతుల అభివృద్ధి లక్ష్యంగా మండలంలో రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాన్ని ఎఫ్ పి ఓ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏ డి డాక్టర్ పి.పెంటయ్య, పశు వైద్యాధికారి కె.వీరారెడ్డి ఐఆర్డీఎన్ వ్యవస్థాపకులు వాడపల్లి రమేష్ సర్పంచ్ కొల్లు పులమ్మ నాగయ్య, తహసీల్దార్ ధ్రువ కుమార్ ఎంపీడీవో ముక్కపాటి నరసింహారావు సీఈవో అఖిల్ రెడ్డి, చైర్మన్ కొడారు రాము, డైరెక్టర్లు కందుకూరి కృష్ణమూర్తి, నెల్లూరి నాగేశ్వరరావు, మాతంగి వీరస్వామి, ఉబ్బపల్లి మంగమ్మ, పులగం ప్రభాకర్, శిరీష, స్వాతి రాంబాబు,కాంగ్రెస్ పార్టీ,నాయకులు తదితరులు పాల్గొన్నారు.