25 August, 2026 | 1:41 AM

మేడిపల్లితోనే చొప్పదండి అభివృద్ధి

25-08-2026 12:00 AM

చొప్పదండి, ఆగస్టు 24 (విజయ క్రాంతి): చొప్పదండి నియోజకవర్గ అభివృద్ధి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతోనే సాధ్యమని గంగాధర సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు ముద్దం నగేష్ అన్నారు. సోమవారం గంగాధర ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏళ్లుగా పెండింగ్లో ఉన్న నారాయణపూర్ కుడి కాలువ పనులను పూర్తి చేయడానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 20 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు.

సంబంధిత శాఖ అధికారులతో కుడి కాలువను సందర్శించి పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశించినట్లు పేర్కొన్నారు. కుడి కాలువ పూర్తయితే గంగాధర, బోయినపల్లి, వేములవాడ మండలాల్లోని దాదాపు 30 గ్రామాల్లో దాదాపు  30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. కుడికాలువ పూర్తి అయితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు పేరు వస్తుందన్న అక్కసుతో బిఆర్‌ఎస్ నాయకులు పనులను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

కుడి కాలువ పనులను అడ్డుకుంటే గ్రామాల్లో తరిమికొడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బోయినపల్లి మండల సర్పంచ్లు సంఘం అధ్యక్షుడు భీం రెడ్డి మహేశ్వర్ రెడ్డి, బీర్ల ఆనందం, బొంగోని అశోక్, ఉయ్యాల శ్రీనివాస్, గడిల మోహన్, లింగాల లింగయ్య, దాసరి శంకరయ్య, పడాల విజయలక్ష్మి రాజన్న, కడారి కనకయ్య, ఆరే రాజశేఖర్, గుడి ప్రవీణ్ రెడ్డి, గుండవేని తిరుపతి, కొలిపాక మల్లేశం, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.